హామీ ఇచ్చి మోసం చేశారు | - | Sakshi
Sakshi News home page

హామీ ఇచ్చి మోసం చేశారు

Jul 15 2025 6:29 AM | Updated on Jul 15 2025 6:29 AM

హామీ ఇచ్చి మోసం చేశారు

హామీ ఇచ్చి మోసం చేశారు

● చంద్రబాబుపై నిరుద్యోగ యువత ఆగ్రహం ● డీఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం ● గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని డిమాండ్‌ ● పాడేరులో భారీగా ఆదివాసీ నిరుద్యోగ గర్జన ● ఐటీడీఏ వద్ద ధర్నా

పాడేరు: జీవో నంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని, ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను విస్మరించి, మోసం చేశారని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర, పలువురు ఆదివాసీ నిరుద్యోగ యువ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేసి, గిరిజన ప్రాంత ఉద్యోగాలన్నీ అర్హత కలిగిన స్థానిక ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పాడేరు పట్టణంలో ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆదివాసీ గర్జన కార్యక్రమం నిర్వహించారు. మోదకొండమ్మ ఆలయం నుంచి పాత బస్టాండ్‌, సినిమాహాల్‌ సెంటర్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు ప్లకార్డుల తో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర, పలువురు ఆదివాసీ నిరుద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య రోజు,రోజుకు తీవ్ర రూపం దాలుస్తోందని చెప్పారు. వేలాది మంది ఆదివాసీలు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే గిరిజన యువత పెడదారిన పట్టే అవకాశం ఉందని తెలిపారు. అరకులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తాము అధికారంలోకి వస్తే జీవో నంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని, ఐటీడీఏ పరిధిలో స్పెషల్‌ డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ నెరవేర్చకుండా ఆదివాసీ నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. ఇప్పటికై న స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించాలని, షెడ్యూల్‌ ప్రాంత ఉద్యోగ నియామకాలచట్టం చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఐటీడీఏ అధికా రులకు వినతిపత్రాన్ని అందజేశారు. 11మండలాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement