
రేషన్ సరుకుల కోసం నడక యాతన
ముంచంగిపుట్టు: గత ప్రభుత్వ హయాంలో ఇంటి ముందే రేషన్ సరుకులు పొందే గిరిజనులు ఇప్పుడు వాటికోసం నడక యాతన పడుతున్నారు. ముంచంగిపుట్టు మండలం సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామ రేషన్‌కార్డుదారులు రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్తే గానీ రేషన్ బియ్యం పొందలేని పరిస్థితి నెలకొంది. సోమవారం కుమ్మరిపుట్టు రేషన్‌దారులు కాలినడకన సుజనపేట డీఆర్ డిపోకు వచ్చి రేషన్ సరుకులు మోసుకుని వెళ్లారు. రేషన్ వాహనాలను నిలిపివేయడంతో అవస్థలకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
జీసీసీ పటిష్టతకు
ప్రభుత్వానికి సిఫార్సు