
ట్రాలీ..ఆటో ఢీ
● ముగ్గురికి తీవ్ర గాయాలు
జి.మాడుగుల: చింతపల్లి రోడ్డు మార్గంలో రచ్చపల్లి గ్రామ సమీపాన ట్రాలీ, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జేసీబీతో చింతపల్లి వైపు వెళ్తున్న ట్రాలీ, ఎదురుగా జి.మాడుగుల వైపు వస్తున్న ఆటో శనివారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మండలంలోని బూరుగువీధి గ్రామానికి చెందిన గొల్లోరి భానుమతి, గొల్లోరి కృష్ణ, వినయ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు దైవ దర్శన నిమిత్తం లోతుగెడ్డ జంక్షన్‌కు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పాడేరు జిలాఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.