
38 దేవాలయాల్లో బాలవికాస్ కేంద్రాలు
సీలేరు: జిల్లాలో 38 దేవాలయాల్లో బాలవికాస్ కేంద్రాలను ప్రారంభించినట్టు సమరతసేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ గొర్లె గణేశ్వరరాజు తెలిపారు. జీకే వీధి మండలం దారకొండ కాలనీలో ఏర్పాటు చేసిన బాలవికాస్ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో సమరత సేవా ఫౌండేషన్ జిల్లాలో 51 దేవాలయాలను నిర్మించిట్టు చెప్పారు. వీటిలో 38 ఆలయాల్లో బాలవికాస్ కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. పాఠశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు నీతి పద్యాలు ,భగవద్గీత శ్లోకాలు ,అభినయ గీతాలు,శనివారం భజన,ఆదివారం ఆటలు నేర్పిస్తారని చెప్పారు. ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు పెద్దలను గౌరవించడం,క్రమశిక్షణ అలవడుతాయన్నారు. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను బాలవికాస్ కేంద్రాలకు పంపించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు సుంకరి కృష్ణమూర్తి,అర్చకుడు సాగిన భూపతి ,మాతాజీ తగ్గి వసంతదేవి, ఆలయ కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.