
గిడ్డి ఈశ్వరికి అసమ్మతి సెగ
సాక్షి,పాడేరు: టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అసమ్మతి సెగ నెలకొంది. పార్టీ గ్రామ, మండల కమిటీల ఎన్నికల నిర్వహణలో ఆమెతోపాటు, మండల పరిశీలకుడు రెహ్మాన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జి.మాడుగుల మండలానికి చెందిన టీడీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా శుక్రవారం పాడేరులోని కేవీఆర్ లాడ్జి మేడపై సమావేశమయ్యారు. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, టూరిజంశాఖ డైరెక్టర్ కిల్లు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో జి.మాడుగుల టీడీపీ కీలక క్యాడర్ అంతా గిడ్డి ఈశ్వరి వైఖరిపై మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు గ్రామ, మండల కమిటీల్లో అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో టీడీపీకి రాజీనామా చేస్తామని వారంతా హెచ్చరించారు. అవసరమైతే ఛలో అమరావతి కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. గిడ్డి ఈశ్వరి పార్టీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆమెకు వ్యతిరేకంగా పాడేరులో
జి.మాడుగుల టీడీపీ నేతల సమావేశం
పార్టీ కోసం పనిచేసేవారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన
వ్యతిరేక విధానాలు విడనాడాలని
నినాదాలు
అవసరమైతే చలో అమరావతి చేపడతాం
రాజీనామా చేసేందుకు
వెనుకాడేది లేదని హెచ్చరిక