
శరత్‌నగర్ సబ్ సెంటర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
● ఉన్నత ప్రమాణాలకు 84.56 శాతం మార్కులు
డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని శరత్‌నగర్ సబ్‌సెంటర్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించిందని వైద్యాధికారులు నజీబ్, కుమార్‌రత్న తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 25న ఇక్కడ వచ్చిన ఎన్‌క్యూఏఎస్ బృందం సేవలు, పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించి వెళ్లిందన్నారు. వైద్య ఆరోగ్య వసతుల్లో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు 84.56 శాతం మార్కులు లభించినట్టు వారు పేర్కొన్నారు.