
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
అడ్డతీగల : అడ్డతీగల మండలం భీముడుపాకలు బోడకొండమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం గుర్తించడం జరిగిందని సీఐ బి.నరసింహమూర్తి తెలిపారు. మృతుడు సుమారు ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఉండి మృతుని శరీరంపై పసుపు రంగు డిజైన్ షర్టు, నీలం రంగు ఫ్యాంటు ధరించి కాళ్లకు నలుపు రంగు కలిగిన చెప్పులు కలిగి ఉన్నాడన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. పైన పేర్కొన్న గుర్తులతో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తు పట్టినట్టయితే అడ్డతీగల సీఐ 9440900768, ఎస్‌ఐ 9440900769 మొబైల్ నంబర్లలో సంప్రదించాలన్నారు.