
అప్పన్నా.. వస్తున్నాం..
ముస్తాబైన పుష్పరథం
సింహాచలం: సింహగిరి ప్రదక్షిణకు సమయం ఆసన్ననమైంది. వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వేంజేసిన 32 కిలోమీటర్ల కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే సమయం వచ్చింది. ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం గిరి ప్రదక్షిణ ఉత్సవం జరగనుంది. ఈ ఏడాది సుమారు 6 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని అంచనా వేశారు. ఈ మేరకు కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.
సింహగిరికి మెట్లమార్గంలో అనుమతి
గురువారం కొండపైకి కేవలం మెట్లమార్గంలో మాత్రమే అనుమతి ఇస్తారు. ఆరోజు ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ముగిసే వరకు కొండదిగువకి వచ్చే భక్తులను దేవస్థానం బస్సులు, దేవస్థానం అద్దె చెల్లించిన 50 ఆర్టీసీ బస్సుల్లోను ఉచితంగా చేరవేస్తారు.
దర్శన సమయాలు
బుధవారం ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదేరోజు రాత్రి చేరుకునే భక్తులకు రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు లభిస్తాయి. ఆ తర్వాత తిరిగివారికి 10వ తేదీ ఉదయం 5.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు అందజేస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు దర్శనాలు ఉండవు. తిరిగి సాయత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు లభిస్తాయి.
నేడే సింహగిరి ప్రదక్షిణ మధ్యాహ్నం 2 గంటలకు పుష్పరథం ప్రారంభం రేపు వేకువజాము 3 గంటల నుంచి ఆలయ ప్రదక్షిణ
రేపు ఆలయ ప్రదక్షిణ
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం 3 గంటల నుంచి ఆలయ ప్రదక్షిణలకు అనుమతిస్తారు. ఆలయ బాహ్య ప్రకారం చుట్టూ 400 మీటర్ల మేర ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఆలయ ప్రదక్షిణలకు సంబంధించి ఉత్తర రాజగోపురం వద్ద, దక్షిణ రాజగోపురం వద్ద వంతెలను ఏర్పాటు చేశారు.

అప్పన్నా.. వస్తున్నాం..

అప్పన్నా.. వస్తున్నాం..

అప్పన్నా.. వస్తున్నాం..