ఏర్పాట్లు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు ఇలా..

Jul 9 2025 6:44 AM | Updated on Jul 9 2025 6:44 AM

ఏర్పా

ఏర్పాట్లు ఇలా..

● సింహాచలంలోని తొలిపావంచా వద్ద బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభిస్తారు.

● అక్కడ భక్తులు కొబ్బరి కాయలు కొట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుమ గడ్డర్లు ఏర్పాటు చేశారు.

● అడవివరం–హనుమంతవాక బీఆర్‌టీఎస్‌ మార్గంలో రెండో టోల్‌గేట్‌ వద్ద నుంచి ప్రదక్షిణ ప్రారంభించే భక్తుల సౌకర్యార్ధం కొబ్బరికాయలు కొట్టేందుకు 20 ఇనుమ గడ్డర్లు ఏర్పాటు చేశారు. అక్కడ స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు.

● 177 శాశ్వత మరుగుదొడ్లకు అదనంగా మరో 500 తాత్కాలిక మరుగుదొడ్లు జీవీఎంసీ ఏర్పాటు చేసింది.

● వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు షిఫ్ట్‌కి 640 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లకు 1,920 మంది కార్మికులను ఏర్పాటు చేశారు.

● ప్రతీ 200 మీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 132 తాగునీటి పాయింట్లు జీవీఎంసీ ఏర్పాటు చేసింది.

● అప్పుఘర్‌ వద్ద 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లు, హైపవర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు.

● 32 చోట్ల వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, రెండు సూపర్‌ స్పెషాల్టీ వైద్య బృందాలు ఏర్పాటు చేశారు.

● 32 ప్రదేశాల్లో 200 వాట్స్‌ సామర్థ్యం కలిగిన 750 విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. 9 జనరేటర్లు అందుబాటులో ఉంచారు.

● నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

● ప్రతీ ఆరు కిలోమీటరుకు ఒక బృందం చొప్పున మూడు షిప్టుల్లో ఆరు బృందాలను కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ నియమించారు. డిప్యూటీ కలెక్టర్‌ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ఒక్కో బృందంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, ఫైర్‌, పోలీస్‌, వైద్య, విద్య, విద్యుత్‌, రెవెన్యూ, జీవీఎంసీ, ఆర్‌అండ్‌బీ, రవాణాశాల అధికారులు, సిబ్బంది ఉంటారు.

● బుధవారం ఉదయం 6 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.

● భక్తులకు అందుబాటులో టోల్‌ ఫ్రీనెంబరు 1800–4250–0009, 0891–2507225లను ఏర్పాటు చేశారు.

● కొండదిగువ తొలిపావంచా, అడవివరం, పాతగోశాల జంక్షన్‌, అప్పుఘర్‌, మాధవధారలో పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టంలు ఏర్పాటు చేశారు.

● జోడుగుళ్లపాలెం వద్ద సముద్రస్నానాలకు అనుమతి ఇవ్వలేదు.

● లుంబిని పార్క్‌ వద్ద తాత్కాలిక స్నానపు గదులు, టాయ్‌లెట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు.

● గిరి ప్రదక్షిణ మార్గంలో పాఠశాలలు, కల్యాణ మండపాల్లో మొత్తం 14 చోట్ల విశ్రాంతి

ప్రాంతాలను గుర్తించారు.

● 10న సింహగిరిపై అన్నప్రసాద భవనంలో కదంబం, దద్దోజనం అన్నప్రసాదంగా అందజేస్తారు.

● ఉచిత, రూ.100, రూ..300 దర్శనాల క్యూలను ఏర్పాటు చేశారు.

● భక్తుల కోసం సుమారు లక్ష లడ్డూలను విక్రయానికి సిద్ధం చేశారు.

ఏర్పాట్లు ఇలా.. 1
1/1

ఏర్పాట్లు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement