
ఇంటింటికీ కూటమి మోసాలు
భృతి అమలు చేయలేదని విమర్శించారు.
● అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులకు వర్తింపకుండా ఎత్తివేశారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిలా వైఎస్ జగన్ పాలనలో వైఎస్సార్‌సీపీ ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించడంతోపాటు అనేక కొత్త పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. మోసం చేసే చంద్రబాబు కన్నా మడమ తిప్పని నేత జగనన్న అంటే ఈప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టమని.. అందుకే మూడు పర్యాయాలు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిపించారన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి ఎదురులేదన్నారు.
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ హామీల బాండ్ పేపర్లను ఇంటింటికి పంచిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
● ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టో బాండ్లు ఇచ్చి మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేమి కాదన్నారు. గతంలో మూడు సార్లు సీఎంగా పనిచేసిన సమయంలో కూడా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని గడగడలాడించిన ధీరుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
● అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో సూపర్‌సిక్స్‌లో ఏఒక్కటీ అమలు చేయలేదన్నారు. 2029లో జగనన్నను సీఎం చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు.
● వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పార్టీ సైనికులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలని పిలుపునిచ్చారు.
● మాజీ ఎమ్మెల్యే హైమావతి మాట్లాడుతూ గడచిన ఏడాది కూటమి కాలంలో నష్టపోయిన విషయాన్ని ప్రజలకు గుర్తుచేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజల్లోకి వెళితే స్వాగతిస్తుండగా, కూటమి నేతలను నిలదీసే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడాన్ని ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఎస్టీసెల్ ప్రదాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రదాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణక్య, విశాఖ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కమ్మిడి అశోక్‌కుమార్, మాజీ జీసీసీ చైర్మన్ స్వాతిరాణి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, అరకులోయ, డుంబ్రిగుడ జడ్పీటీసీలు శెట్టి రోషిణి, జానకమ్మ, అనంతగిరి, డుంబ్రిగుడ ఎంపీపీలు శెట్టి నీలవేణి, బాకా ఈశ్వరి, అరకు లోయ ఆరు మండలాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు కార్యకర్తలు పాల్గొన్నారు.
7వ పేజీ తరువాయి

ఇంటింటికీ కూటమి మోసాలు

ఇంటింటికీ కూటమి మోసాలు

ఇంటింటికీ కూటమి మోసాలు

ఇంటింటికీ కూటమి మోసాలు

ఇంటింటికీ కూటమి మోసాలు

ఇంటింటికీ కూటమి మోసాలు

ఇంటింటికీ కూటమి మోసాలు