
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
అడ్డతీగల : అడ్డతీగల మండలం, తుంగమడుగుల గ్రామ పరిసరాల్లో మంగళవారం గుర్తు తెలియని మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు ఎస్‌ఐ బి.వినోద్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న ఆమెను కొందరు గ్రామస్తులు సమీపంలోని దుప్పులపాలెం పీహెచ్‌సీకి చికిత్స కోసం పంపించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు డ్యూటీ డాక్టర్ చెప్పారన్నారు. మృతురాలి వయస్సు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చన్నారు. ఎర్రచారలు కలిగిన చీర ధరించి ఉందన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా తిరుగుతూ ఉందని చుట్టుపక్కల వారి చెప్పి ఉన్నారన్నారు. రోడ్డు ప్రమాదం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.