
మత్తు పదార్థాల జోలికి పోవద్దు
● విద్యార్థులకు ఎస్పీ అమిత్ బర్దర్ సూచన
సాక్షి,పాడేరు: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అమిత్‌బర్దర్ సూచించారు. ఆపరేషన్ సేప్ క్యాంపస్ జోన్ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వాడకంతో జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ విద్యార్థులంతా చెడు అలవాట్ల జోలికి పోకుండా ఉన్నత చదువులు, ఉద్యోగ లక్ష్యాన్ని నిర్మించుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదవాలన్నారు. ఉన్నత స్థానా నికి ఎదిగి గిరిజన ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఏఎస్పీ కె.ధీరజ్, డీఎస్పీ సహబాజ్ అహ్మద్, సీఐ దీనబంధు, ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.