
ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం
కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: గోదావరి,శబరి నదుల ముంపు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూనవరం, ఎటపాక, చింతూరు, వీర్‌పురం మండలాల్లో అధిక వర్షాలు కురుస్తున్నందున అన్నిశాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య, విద్యుత్‌శాఖలు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని, రానున్న రెండు రోజుల్లో మొబైల్ టాయ్‌లెట్లను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలను తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ఎస్పీ అమిత్‌బర్దర్‌ఱ మాట్లాడుతూ వరదలపై అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.పద్మలత, గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి డీడీ రజని, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఈశ్వరరావు, తహసీల్దార్ తారకేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమర్థంగా ఉపాధి హామీ అమలు
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హమీ పథకం పనులను సమర్ధవంతంగా అమలుజేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఎంపీడీవోలు, ఉపాధి పథకం అధికారులు, పంచాయతీరాజ్,గ్రామ సచివాలయాలు, పౌరసరఫరాలశాఖ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఆయాశాఖల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పాడేరు డివిజన్‌లో 30 వేల మొక్కలు పెంపకం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. నాణ్యమైన మొక్కలు సరఫరా చేయకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు తల్లికి వందనం అమలుచేయాలన్నారు. చిన్నారులను పంచాయతీ కార్యదర్శులు జనన ధ్రువపత్రాలు అందజేయాలన్నారు. పారిశుధ్యం మెరుగుతోపాటు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, డ్వామా పీడీ విద్యాసాగర్, డీపీవో చంద్రశేఖర్, నో డల్ అధికారి కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.