
గురుకుల కళాశాల స్థలం కోసం వినతి
వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ గురుకుల బాలికల జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని కోరుతూ ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మీల ఆధ్వర్యంలో స్థానికులు సోమ వారం వినతిపత్రాన్ని అందజేశారు. మండలంలోని చవిటిదిబ్బలు గ్రామంలో ఖాళీగా ఉన్న భూమిని కళాశాల కోసం కేటాయించమని వినతిలో కోరారు. దీనిపై పీవో స్పందించి, సదరు స్థలాన్ని పరిశీలించి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే కళాశాల కోసం కేటాయించమని తహసీల్దార్ పి.వేణుగోపాల్‌కు లేఖలో ఆదేశించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంనకు ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మి తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.