
180 కిలోల గంజాయి స్వాధీనం
రంపచోడవరం: దేవీపట్నం మండలం ఇందుకూరుపేట సమీపంలో ఆటోలో తరలిస్తున్న 180 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ త్రినాథ్, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ పైడేశ్వరరావు తెలిపారు. గంజాయి రవాణాకు వినియోగించిన ఆటోను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు.
సారా బట్టీపై దాడి– ఒకరి అరెస్టు
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్ర సమీప రక్షిత అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న సారా బట్టీపై సోమవారం దాడి చేసి, ఒకరిని అరెస్టు చేసినట్టు రాజవొమ్మంగి ఎస్‌ఐ నరసింహలలమూర్తి తెలిపారు. సారా బట్టీని, వంద లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశామని చెప్పారు. బట్టీ నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి ఆరు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ చెప్పారు.