
తహసీల్దార్ నర్సమ్మ సేవలు మరువలేనివి
ముంచంగిపుట్టు: మండల తహసీల్దార్ ఆర్.వి.ఎస్.ఎల్.నర్సమ్మ సేవలు మరువలేనివని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలో స్థానిక కల్యాణ మండపంలో తహసీల్దార్ నర్సమ్మ పదవీ విరమణ సన్మాన సభ ను సోమవారం రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ తహసీల్దార్ నర్సమ్మ విశేషమైన సేవలందించారన్నారు. ప్రతి ఒక్కరు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని, రెవెన్యూ శాఖలో కిందస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఆమె అందరి మన్ననలు పొందారని కొనియాడారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి, వృత్తినే ధైవంగా భావించి, గిరిజనులకు రెవెన్యూ శాఖ పరంగా ఉత్తమ సేవలు అందించారని, పదవీ విరమణ అనంతరం జీవితం సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ విరమణ పొందిన తహసీల్దార్ నర్సమ్మ, వెంకటరమణ దంపతులకు జ్ఞాపికలు అందజేసి, శాలువాతో జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మూర్తి దంపతులు, హుకుంపేట, పెదబయలు మండలాల తహసీల్దార్లు కృష్ణారావు, రంగారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నేతలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్
జల్లిపల్లి సుభద్ర