
గిరి ప్రదక్షిణ భక్తులకు సౌకర్యాలు కల్పించండి
డాబాగార్డెన్స్: ఈ నెల 9న జరగనున్న సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి. త్రినాథరావు అభ్యర్థించారు. జీవీఎంసీ కమిషనర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, బీచ్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, రోడ్ల అభివృద్ధి వంటి ఏర్పాట్లు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి ప్రసాదం, చందనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్, అర్చకులు పాల్గొన్నారు.