రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
రాజవొమ్మంగి: మండలంలోని అప్పన్నపాలెం గ్రామానికి చెందిన ముర్ల భీమరాజు (38) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. భీమరాజు మూడు రోజుల క్రిందట బైక్‌పై స్వగ్రామం వెళ్తు మండలంలోని సూరంపాలెం వద్ద వాహనం అదుపుతప్పి స్వీయ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందినట్టు స్థానికులు చెప్పారు. భీమరాజుకు భార్య, నలుగురు పిల్లలున్నారు. గిరిజనుడు అయిన భీమరాజు నాలుగు రోజుల క్రిందట అమలాపురంలో జరిగిన డీఎస్సీ పరీక్షకు హాజరై తిరిగి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజవొమ్మంగి ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలముకొంది.


