సోషల్ మీడియాలోదుష్ప్రచారంపైపోలీసులకు ఫిర్యాదు
పాడేరు : తనపై ఓ ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని, తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కూడా సుబ్రహ్మణ్యం పోలీసులను కోరారు. ఈ మేరకు మంగళవారం పాడేరు సీఐ దీనబంధుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల గిరిజన ప్రాంతంలో జరుగుతున్న పలు అన్యాయాలు, అక్రమాలపై తాను ప్రశ్నిస్తుంటే కొంతమందికి గిట్టడం లేదని తెలిపారు. దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ విషయంపై తాను కోర్టులో ప్రత్యేక కేసు వేస్తానని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్ ఉన్నారు.


