
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్
● సర్వ శిక్షా అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు
సాక్షి,పాడేరు: జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో టెన్త్ ఫెయిలైన విద్యార్థినిలకు నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని సర్వ శిక్ష అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని యండపల్లివలస కేజీబీవీలో టెన్త్ విద్యార్థినులకు అమలుజేస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లాలోని 19 కేజీబీవీ పాఠశాలల పరిధిలో టెన్త్ తప్పిన విద్యార్థినులకు రంపచోడవరం, చింతూరు, చింతపల్లి, హుకుంపేట, అరకులోయ కేజీబీవీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులంతా టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక బోధన కార్యక్రమాలతో పాటు రోజువారి పరీక్షలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.