
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: మండలంలోని లోతట్టు, సరిహద్దు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో సోమవారం సీఐ బి.నరసింహమూర్తి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారం, మరోపక్క ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి రవాణా అవుతోందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,అపరిచితులపై నిఘా ఉంచారు. ఈ తనిఖీల్లో సీఆర్‌పీఎఫ్ పోలీసులు,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.