
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● ఇంటర్ బోర్డు అధికారి భీమశంకర్
పాడేరు రూరల్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ బోర్డు అధికారి భీమశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో 3075 మంది విద్యార్థుల్లో 416 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 515 మందిలో 154 మంది పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులో1564 మందికి 112 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 143 మందిలో 70 మంది పరీక్షలు రాయలేదని పేర్కొన్నారు. ఎటువంటి మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.