
అటవీ అభివృద్ధికి చర్యలు
అటవీశాఖ (విశాఖ) కన్జర్వేటర్ బీఎం మొయిద్దీన్ దివాన్
సాక్షి,పాడేరు: జిల్లాలో అటవీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ విశాఖ కన్జర్వేటర్ బీఎం మొయిద్దీన్ దివాన్ తెలిపారు. శనివారం ఆయన పాడేరు అటవీ డివిజన్‌లో పర్యటించారు. అటవీ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ముందుగా పాడేరు డివిజన్ అటవీశాఖ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా ఆయన పలు రకాల మొక్కలను నాటారు. అనంతరం పాడేరు, జి.మాడుగుల అటవీ రేంజి పరిధిలో జరుగుతున్న ప్లాంటేషన్ పనులను తనిఖీ చేశారు. ప్లాంటేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అటవీ అభివృద్ధితో పాటు అటవీ సంరక్షణకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాడేరు డీఎఫ్‌వో పీవీసందీప్‌రెడ్డి, రేంజి అధికారులు లావణ్య, ఆర్.అప్పలనాయుడు, వెంకయ్యచౌదరి, రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

అటవీ అభివృద్ధికి చర్యలు