
రత్నంపేటలో పాలకేంద్రం ప్రారంభం
కొయ్యూరు: మండలంలోని రత్నంపేటలో మహిళా డెయిరీ సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోనే మొదటి పాల కేంద్రాన్ని జిల్లా పశువైద్యాధికారి నర్సింహులు, పశుసంవర్థక శాఖ ఏడీ చంద్రశేఖర్ ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలను వారు అభినందించారు. గ్రామంలో 45 మంది మహిళలు సంఘంగా ఏర్పడి పాలకేంద్రం ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు ఏహెచ్‌ఏ నగేష్, సర్పంచ్ పాటి రత్నం ఎంతో కృషి చేశారన్నారు. పశువైద్యాధికారులు రాజేష్ కుమార్, ప్రసన్న కుమార్, దుర్గాప్రసాద్, విశాఖడెయిరీ సూపర్‌వైజర్ ఎం.జగదీష్ పాల్గొన్నారు. ఇలావుండగా మండలంలోని ఆడాకుల, ఆర్.కొత్తూరు, కంఠారంలో కూడా త్వరలో పాల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోఆపరేటివ్ బ్యాంకులో మహిళా రైతులతో ఖాతాలు ఏర్పాటుచేయడంతోపాటు అవసరమైన రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
మహిళా డెయిరీ సహకార
సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు