
గతుకుల రోడ్డుపై ఆటో బోల్తా
ఎస్.రాయవరం: మండలంలోని నీలాద్రిపురం సమీపంలో అడ్డురోడ్డు – నర్సీపట్నం ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గురువారం ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎస్‌ఐ విభీషణరావు వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన శానాపతి లక్ష్మీవరప్రసాద్(32) భార్యాపిల్లలతో తన స్వగ్రామం నుంచి చినగుమ్ములూరు వెళ్తుండగా, రోడ్డుపై గతుకులు కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటో కింద పడిపోయిన లక్ష్మీవరప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అడ్డురోడ్డు సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతడు నాలుగేళ్లుగా తిమ్మాపురం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చినగుమ్ములూరులో వివాహానికి వెళ్లేందుకు వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.
డ్రైవర్ మృతి