
మలేరియా పట్ల అప్రమత్తత అవసరం
● డీఎంవో తులసి
చింతపల్లి: ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అదికారి తులసి అన్నారు. గురువారం ఆమె కిటుముల శివారు నిమ్మలపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మలేరియా పాజిటివ్ కేసు నమోదైన ఇంటిని, రోగిని పరిశీలించారు. దోమల వల్ల వచ్చే వ్యాదులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. రక్త పరీక్ష కిట్లు ఆశా కార్యకర్తలు వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. మలేరియా వ్యాధి పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ముందుగా గుర్తించిన గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారి చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మందు పిచికారి చేయుంచుకోవాలన్నారు. జూన్ 15 వరకూ జిల్లా వ్యాప్తంగా పిచికారి కొనసాగుతుందన్నారు. సబ్ యూనిట్ అదికారులు బుక్కా చిట్టిబాబు, సత్యనారాయణ, ఏఎంవో యుగంధర్ పాల్గొన్నారు.