
ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో వర్షాలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నం నుంచి పాడేరుతో పాటు అనేక ప్రాంతాలలో విస్తారంగా వర్షం కురిసింది.పాడేరు పట్టణం.సమీప ప్రాంతాలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎకదాటిగా కురిసిన కుండపోత వర్షంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు ఖరీఫ్‌తోపాటు, రబీ పంటలకు మేలు చేస్తాయని జిల్లా వ్యవసాయాఽధికారి ఎస్‌బీఎస్ నందు తెలిపారు.
రోడ్డుకు అడ్డంగా కూలిన వృక్షం
అడ్డతీగల: మండలంలో గురువారం వీచిన ఈదురుగాలులకు అడ్డతీగల–వై.రామవరం మార్గంలో వెదురునగరం వద్ద భారీ వృక్షం కూలింది. దీంతో సుమారు రెండు గంటల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, స్థానికులు ఎట్టకేలకు భారీ వృక్షాన్ని రోడ్డుకు అడ్డంగా లేకుండా తొలగించారు.
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదనీరు భారీగా ప్రవహించింది. సంతబయలు, ఇందిరాకాలనీల్లో వరదనీరు ఇళ్లముందు నిలిచిపోయింది. పెనుగాలులు జీడిమామిడికి నష్టం కలిగించాయి.
రాజవొమ్మంగి: మండలంలో గురువారం ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.

ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు

ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు