
రూ.400 కోట్లతో440 ప్రాజెక్టులు
● నాబార్డు డీడీఎం గౌరీశంకర్
చింతపల్లి: జిల్లాలో నాబార్డు ద్వారా రూ.400 కోట్లతో 440 ప్రాజెక్టులు చేపడుతున్నట్టు నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ (డీడీఎం) వి.గౌరీశంకర్ తెలిపారు. గురువారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన ఆయన మన్యసీమ, గిరిజన్ వికాస్ ప్రాంతీయ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజన రైతాంగం ఆర్థికాభివృద్ధి సాధనకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఏడు ప్రాజెక్ట్‌లు అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఆదాయాన్నిచ్చే ఐదు వేల ఎకరాలకు అవసరమైన పండ్ల మొక్కల పెంపకాన్ని ఆర్థికంగా చేయూత అందిస్తామన్నారు. గిరిజన యవత సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే వారి ఆర్థికాబివృద్ధికి నాబార్డు సాయం అందిస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో మన్యసీమ, సుగుణ, మాతోట సీఈవోలు శ్రీనివాసరావు, రాజేష్, చిన్నారావు,సిబ్బంది పాల్గొన్నారు.