
12 కిలోల గంజాయి స్వాధీనం
నక్కపల్లి: జాతీయరహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద తమిళనాడు, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి నక్కపల్లి పోలీసులు 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ కుమార స్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరుకు చెందిన మునివెంకటప్ప అంజనప్ప, తమిళనాడుకు చెందిన కుప్పా ముత్తులు స్కూలు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోతుండగా ఎస్‌ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద రూ.50 వేలు విలువగల 12 కిలోల గంజాయి లభించిందన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. అంజనప్పపై గతంలో హత్య కేసు నమోదయిందని, కుప్పా ముత్తపై గంజాయి కేసు నమోదైనట్టు తెలిపారు.