
సవతి ప్రేమ!
విశాఖ జోన్‌పై
విశాఖ జోన్, రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్‌కి రూ.170 కోట్లు మాత్రమే..
రాయగడ
డివిజన్‌కు ప్రత్యేకంగా
రూ.110 కోట్లు
కేటాయింపు
కన్సాలిడేట్
బడ్జెట్‌లో
అరకొర
కేటాయింపులు
డబ్లింగ్ పనులు..
కొత్త లైన్లకు నిధులు
● జోన్‌కు అన్యాయం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ మిగిలిన విషయాల్లో కొంతమేర కేటాయింపులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులకు ఈ బడ్జెట్‌లో కొంత మేర నిధులు కేటాయించడం శుభపరిణామం. కన్సాలిడేటెడ్ బడ్జెట్‌లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో కేటాయింపులిలా ఉన్నాయి.
● ఓర్ ఎక్స్ఛేంజ్ కాంప్లెక్స్(ఓఈసీ) నుంచి ఉత్తర సింహాచలం వరకు 5.22 కి.మీ మేర డబ్లింగ్ పనులకు రూ.81.22 కోట్లు.
● పెందుర్తి నుంచి ఉత్తర సింహాచలం మధ్యలో సింహాచలం వద్ద సర్ఫేస్ క్రాసింగ్ లేకుండా చేసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.183.65 కోట్లు
● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకు 20.543 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణం కోసం రూ.302.25 కోట్లు.
● వడ్లపూడి జంక్షన్‌ను అనుసంధానిస్తూ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ వరకూ టై లైన్ మాదిరిగా 12.04 కి.మీ మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.154.28 కోట్లు.
● విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు 15.31 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.159.47 కోట్లు.
● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.64 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.129.45 కోట్లు.
● పలాస–విశాఖపట్నం–దువ్వాడ(బీ రూట్)లో ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు.
● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.07 కి.మీ మేర బైపాస్ డబ్లింగ్ పనులకు రూ.25.93 కోట్లు.
● విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.43.07 కోట్లు.
సాక్షి, విశాఖపట్నం : కొబ్బరికాయ కొట్టేశాం.. కార్యాలయాలు కట్టేయండి అన్నట్లుగా మారింది విశాఖ రైల్వే జోన్‌పై ప్రభుత్వ వైఖరి. ప్రచార ఆర్భాటం.. ఆపై శంకుస్థాపన.. భూమి చదును.. ప్రజెంటేషన్లు.. గ్రాఫిక్స్‌లోనే హడావుడి కనిపిస్తుందే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కూడా కదలడం లేదన్న విషయం నిధుల కేటాయింపులోనే స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్‌కు అనుబంధంగా రైల్వే కేటాయింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై సవతి ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్‌తో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్‌కు కలిపి కేవలం రూ.170 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. రాయగడ డివిజన్ పనులకు మాత్రం ప్రత్యేకంగా మరో రూ.110 కోట్లు కేటాయించడం మరింత బలాన్ని చేకూర్చుతోంది. కీలకమైన జోన్‌కు పప్పుబెల్లాలు ఇచ్చి.. రాయగడ డివిజన్‌కు మాత్రం భారీగా నిధులు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భూమి చదును పనులకే పరిమితం
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును పనులకే పరిమితమైంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటం వల్లనే పనుల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. 2025–26 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి విదిలించని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రైల్వే కన్సాలిడేటెడ్ బడ్జెట్‌లోనూ మొండి చెయ్యి చూపించింది.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..!
జోన్‌కు శంకుస్థాపన చేసేశామంటూ పచ్చపత్రికల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ భారీగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణం మాత్రం తమకు అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ జోన్ కార్యకలాపాలు ఇప్పట్లో ప్రారంభించకపోయినా ఫర్వాలేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పక్కనపెట్టి రాయగడ డివిజన్ నిర్మాణానికే పెద్దపీట వేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అయినా కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం.

సవతి ప్రేమ!