ఒకరి పరిస్థితి విషమం
హుకుంపేట: ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–అరుకు ప్రధాన రహదారి రంగశీల గ్రామ సమీపంలో డుంబ్రిగుడ మండలం కితలంగి గ్రామానికి చెందిన తాంగుల సత్యనారాయణ(40) బైక్‌పై మంగళవారం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతరకు వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, తనతో ఉన్న రంగశీల గ్రామానికి చెందిన కొర్ర బలరామ్ అనే వ్యక్తి తీవ్ర గాయలు పాలైయ్యాడు.
గాయాలతో ఉన్న వ్యక్తిని పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైజాగ్ కేజీహెచ్‌కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పొలీసులు ఘటన స్థలానికి చెరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.