
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడు భార్య మృతి
సాక్షి, పాడేరు : పాడేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత కొట్టగుళ్లి చిట్టినాయుడు భార్య గంగాభవానీ (70) మంగళవారం రాత్రి కేజీహెచ్‌లో వైద్యసేవలు పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి గంగాభవాని మాతృమూర్తి. సమాచారం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ నేత చెట్టి వినయ్ సంతాపం వ్యక్తం చేశారు. వారంతా పాడేరులోని గుడివాడ గ్రామానికి చేరుకుని గంగాభవానీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తదితరులు సంతాపం తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు, వర్తకులంతా గంగాభవానికి కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. సంతాప సూచకంగా మధ్యాహ్నం వరకు పట్టణంలోని వర్తకులు దుకాణాలను మూసివేశారు.

మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడు భార్య మృతి