
వుషు స్టేట్ టోర్నమెంట్‌లో 12 మెడల్స్
నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్‌లో నింజాస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు 12 పతకాలు సాధించారు. కర్నూల్ జిల్లా శ్రీవెంకటేశ్వర కల్యాణమండపంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన స్టేట్ వుషు చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొన్నారు. అక్షయ రాణి–సీనియర్ వుమెన్.. శ్రీరామ్ నిహాల్, పి.ప్రణీత–సబ్ జూనియర్.. వై.దివాకర్ మెన్ సీనియర్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. జి.సాయి ఉమెన్ సీనియర్, యు.రవికుమార్ సీనియర్ మెన్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్ బాయ్స్ విభాగంలో టి.జగదీష్, వై.సాత్విక్, ఎం.దుర్గాప్రసాద్, ఎం.హర్ష, ఎం.సాయి సందీప్, కె.విజయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కోచ్ ప్రియాంక్ ఆధ్వర్యంలో క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులను మోహన్ ముత్యాల, నేషనల్ రిఫరీ వెంకటేష్ అభినందించారు. 600 మందికి పైగా పాల్గొన్న క్రీడాకారుల్లో నింజాస్ క్రీడాకారులు పోటీ పడి మెడల్స్ సాధించారన్నారు.