
థియేటర్లలో నవ్వులే నవ్వులు
డాబాగార్డెన్స్ : యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో మీడియామీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు.
శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ : నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. దర్శకుడు కార్తీక్‌రాజు సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి ప్రేక్షకులను నవ్వించారని, ముఖ్యంగా సెకండాఫ్‌లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు.
విశాఖ అంటే చాలా ఇష్టం : హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని వారు కొనియాడారు.
సింగిల్.. అలరించే కామెడీ ఎంటర్‌టైనర్
విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్