
జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి కల్పిస్తాం
సీలేరు: ఉద్యమం పేరుతో అడవిలో తిరుగుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే తమ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తామని చింతపల్లి ఏఎస్పీ నవ జ్యోతి మిశ్రా అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందన్నారు. జీకే వీధి, చింతపల్లిలో మావోయిస్టులకు సహకరించే మిలీషియా లొంగుబాట్లు భారీగా జరిగాయన్నారు. ఎదురు కాల్పుల్లో కాకూరి పండన్న అలియాస్ జగన్, రమేష్ మృతి చెందడంతో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మరికొంత మంది మావోయిస్టుల కోసం గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజన గ్రామాల అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనపై కూడా ప్రత్యేక దష్టి పెట్టామన్నారు. గిరిజనులు ఎక్కడైనా రహస్యంగా గంజాయి సాగు చేసినా డ్రోన్లు ద్వారా వాటిని గుర్తించి ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జీకే వీధి సీఐ వరప్రసాద్ పాల్గొన్నారు
మావోయిస్టులకు చింతపల్లి ఏఎస్పీ
నవజోతిమిశ్రా సూచన