
అ
ద్వితీయం... మ్మ సంబరం
ఆకర్షణీయంగా శక్తి, రాక్షస వేషాలు
అంగరంగ వైభవంగా ఘటాల
ఊరేగింపు
డప్పుల దరువులు..
థింసా నృత్యాలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంఽధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి రాష్ట్ర గిరిజన జాతరను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో రెండో రోజైన సోమవారం అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం సతకంపట్టు నుంచి మోదకొండమ్మతల్లి ఉత్సవ ఘటాలను పాడేరు వీధుల్లో ఘనంగా ఊరేగించి, పూజలు చేశారు. రాత్రి వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. మహిళలు ఘటాలను దర్శించుకున్నారు. శక్తి,రాక్షస వేషాలు,గరగల నృత్యాలు,కేరళా బ్యాండ్, డప్పు వాయిద్యాల నడుమ ఘటాల ఊరేగింపు సాగింది. థింసా నృత్యాలతో గిరిజన యువతులు సందడి చేశారు. అనంతరం ఈ ఘటాలను సతకంపట్టు ఉత్సవ విగ్రహం వద్ద కొలువుదీర్చారు. కేజే పురం మహిళలు సతకంపట్టు స్టేజీపై ప్రదర్శించిన కోలాటం భక్తులను అలరించింది.
ప్రత్యేక పూజలు
సోమవారం మోదకొండమ్మతల్లి పుట్టినరోజు కావడంతో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, చెట్టి వినయ్ దంపతులతో పాటు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర,మూర్తి దంపతులతో పాటు అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అరకు ఎంపీ,ఎమ్మెల్యే,జెడ్పీ చైర్‌పర్సన్‌లకు ఉత్సవ,ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుశ్శాలువాలతో సన్మానించారు. మోదమ్మ చిత్రపటాలను,ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా సురేష్‌కుమార్, కొణతాల ప్రశాంత్,కూడి వలసంనాయుడు, కేజీయారాణి,కొణతాల సతీష్, బోనంగి వెంకటరమణ,సల్ల రామకృష్ణ,కాంగు చిన్ని,మోద స్వరూప,మోరి స్వర్ణ, డి.పి.రాంబాబు,రాధాకృష్ణ,చంద్రమోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అ

అ

అ