
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి,పాడేరు: జిల్లాలోని 18 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కేంద్రం పాడేరులోని జూనియర్ కళాశాల సెంటర్‌తో కలిపి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులకు సంబంధించి 3,075మంది విద్యార్థులకు గాను 31మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.ఒకేషనల్ కోర్సుల్లో 515 మందికిగాను 9 మంది పరీక్ష రాయలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ కోర్సుల్లో 1,564 మందికి గాను 14 మంది గైర్హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి సొంటేన భీమశంకరరావు మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లోను సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్టు చెప్పారు.విద్యార్థులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు.
రాజవొమ్మంగి : స్థానిక గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో సోమవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలకు నలుగురు, ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి ముగ్గురు గైర్హాజరైనట్టు ఆయన చెప్పారు.