
తప్పిపోయిన బాలిక తల్లిదండ్రుల చెంతకు
సాక్షి,పాడేరు: మోదకొండమ్మతల్లి జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను డ్రోన్,సీసీ కెమెరాల సాయంతో నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.కంకిపాటి వైశాలి అనే బాలిక మోదకొండమ్మతల్లి ఆలయం రోడ్డులో సోమవారం సాయంత్రం తప్పి పోయింది.బాలిక తండ్రి ఈశ్వరరావు అక్కడ విధుల్లో ఉన్న హుకుంపేట ఎస్‌ఐ ఎల్.సురేష్‌కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించారు.డ్రోన్,సీసీ కెమెరాల సాయంతో గాలించారు.కొంతదూరంలో నడుచుకుంటూ వెళ్తున్న ఈ బాలిక గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు.తప్పి పోయిన బాలికను సకాలంలో గుర్తించి,తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్‌ఐ సురేష్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్ అభినందించారు.
సకాలంలో స్పందించిన హుకుంపేట ఎస్‌ఐ సురేష్