
సింహాచలం ఈవోగాసుజాత బాధ్యతల స్వీకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవో(పూర్తి అదనపు బాధ్యతలు)గా దేవదాయ శాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సింహగిరికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో ఆనంద్‌కుమార్, సూపరింటెండెంట్ కంచెమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో పలుమార్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగా, డిప్యూటీ ఈవోగా ఆమె విధులు నిర్వర్తించారు.