
అప్రమత్తంగా ఉండండి
కొమ్మాది: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న లైఫ్‌గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తంగా ఉండాలని మైరెన్ సీఐ శ్రీనివాసరావు సూచించారు. రుషికొండ బీచ్‌లో ఆదివారం ఆయన పర్యటించారు. తీరం వెంబడి అనుమానిత వ్యక్తులు కనిపించినా.. అనుమానంగా బోట్లు పయనించినా తమకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. రుషికొండ బీచ్‌కు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారని.. జాగరూకతతో వ్యవహరించాలన్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.