
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
పాడేరు రూరల్: పట్టణంలో పలుచోట్ల నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేశారు. పట్టణంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోదమాంబ కాలనీ, పీఎంఆర్‌సీ కాలనీ, లోచలికపుట్టు, సుండ్రుపుట్టు రామాలయం కాలనీ, గోల్డెన్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను జిల్లా సర్కిల్ ఎస్‌ఈ జి.ఎన్.ప్రసాద్, డివిజనల్ ఈఈ ఎ.వి.ఎన్.ఎం.అప్పారావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడేరు మోదమాంబ అమ్మవారి పండుగలో భాగంగా విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు కొత్తగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ శాఖ ఏఈ వెంకటరమణ, జేఈ శ్రీనివాస్,సిబ్బంధి త్రీమూర్తులు,తదితరులు పాల్గొన్నారు.