
ఘనంగా ఉత్సవ మూర్తుల ఊరేగింపు
● అరకులో ముగిసిన వెంకన్నకల్యాణోత్సవాలు
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో గత మూడు రోజులుగా నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, గిరిజన థింసా నృత్యాల నడుమ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ప్రధాన రహదారి, యండపల్లివలస మీదుగా అరకు సంత బయలు వరకు సాగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు బాల గణేష్, ఆలయ, ఉత్సవ కమిటీ చైర్మన్లు దాసుబాబు, సివేరి బాలకృష్ణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సింగరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కాపుగంటి కృష్ణారావు, అప్పలరామ్, చందూ, సత్యనారాయణ, లకే బొంజుబాబు, రంగరాజు పాల్గొన్నారు.