
కీ బోర్డుపై క్రీస్తు గీతాలు
–ఇద్దరు బాలలకు గిన్నిస్ బుక్ సర్టిఫికెట్
మోతుగూడెం/ముంచంగిపుట్టు: హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రీస్తు గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్‌లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో పాల్గొని ఇద్దరు బాలలు ప్రతిభ చూపారు. గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ సొంతం చేసుకున్నారు. కీబోర్డు వాయిస్తున్న సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్‌లోడ్ చేసింది. ఇందులో ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు పంచాయతీ మొంజాపుట్టు గ్రామానికి చెందిన గడుతుల కామేశ్వరరావు, పుష్పకళ దంపతుల కుమారుడు జాసన్ జోయెల్ అనే బాలుడు పాల్గొన్నాడు. చింతూరు మండలం మోతుగూడెం జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న వేముల ఇజ్రాయిల్ కూడా ప్రతిభ చూపాడు. గత ఏడాది డిసెంబర్‌లో ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన సంగీత కచేరీలో వీరు పాల్గొన్నారు. 18 దేశాలకు చెందిన వాయిద్య కళాకారులతో కలిసి పాల్గొని గంట వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

కీ బోర్డుపై క్రీస్తు గీతాలు