సీలేరు: సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు రబీ పంటలకు శనివారం నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జెన్‌కో అధికార వర్గాలు తెలిపాయి. ధవళేశ్వరం వద్ద నీటి మట్టాలు తగ్గు ముఖం పట్టడంతో ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాలో రబీ పంటలకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు కోరారు. దీంతో డొంకరాయి జలాశయం నుంచి ఐదు వేల క్యూసెక్కులు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కులు కలసి 9,300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి శనివారం వరకు డెల్టాకు 10.19 టీఎంసీలు నీటిని విడుదల చేశారు. మార్చి 31 వరకు నీటిని విడుదల చేయనున్నారు.