సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 5,6,7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు నిమగ్నమాయ్యయి. పురాతన సుండ్రుపుట్టు రామాలయంలో ఉత్సవాల నిర్వహణకు గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. పందిరిరాటను శనివారం వేశారు. రామాలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు.ఈ ఏడాది కూడా శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ఽఅధ్యక్షుడు ఒండ్రు శ్రీరాములు,ఉపాధ్యక్షుడు సాయికిరణ్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ ఉపాధ్యక్షుడు డి.పి.రాంబాబు,గ్రామపెద్దలు డి.పి.సురేష్, లింగమూర్తి, గోపాలకృష్ణ,హరి, బాబురావు,ఉత్సవ కమిటీ ప్రతినిధులు డి.పి.శంకర్,కోడా కోటిబాబు,శివాజీ,బాబీ,సతీష్,సురేష్,శ్యామ్,శివ, మహిళలు పాల్గొన్నారు.