పాడేరు : ప్రకృతి వ్యవసాయ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ప్రతి రైతును భాగస్వామిని చేయాలని రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లాలం భాస్కరరావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి. విజయ్‌కుమార్ వర్చువల్ విధానం ద్వారా హాజరై మాట్లాడారు. రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఖరీఫ్ వార్షిక ప్రణాళిక, సార్వత్రిక సూత్రాలు, పలు జిల్లాల్లో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు, రైతుల విజయగాధల గురించి సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రీసోర్స్ పర్సన్ రమాప్రభ, మోడల్ మండల టీం లీడర్ శివలోకేష్, వాసన్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ నాయుడు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.