యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్టు

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

నిందితునికి 15 రోజుల రిమాండ్‌

పామూరు:

కోరిక తీర్చమని బలవంతం చేయడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుందని సీఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్సై కట్టా అనూక్‌ తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన బోడ మాధవి పామూరులోని సెయింట్‌మార్‌స్క్‌ ప్రైౖవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. మండలంలోని మోపాడు కొండారెడ్డిపల్లె గ్రామానికి చెదిన షేక్‌.నాగూర్‌బాషా తన పిల్లలను అదేపాఠశాలలో చదివిస్తుండగా వారికోసం వెళ్లి వస్తూండేవాడు. ఈ క్రమంలో నాగూర్‌బాషా టీచర్‌ బోడా మాధవి ఫోన్‌నంబర్‌ తీసుకుని ఆమెతో క్రమంగా స్నేహం ఏర్పరచుకుని ఆమెతో ఫోన్‌ ఛాటింగ్‌, వీడియో కాల్స్‌ చేసేవాడు. అయితే మాధవికి తెలియకుండా నూడ్‌ వీడియోస్‌ స్క్రీన్‌ రికార్డు చేసి వాటితో ఆమెతో బెదిరించేవాడు. తన కోరిక తీర్చకుంటే వీడియోలు సోషల్‌ మీడియాలో ఉంచుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పరువు పోతుందని భయపడిన మాధవి ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విచారణలో మాధవి బలవాన్మరణానికి కారకుడైన నాగూర్‌బాషాను పామూరులోని కందుకూరు రోడ్డులో అరెస్ట్‌చేసినట్లు వెల్లడించారు. నిందితున్ని కనిగిరి ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement