గ్రామాల అభ్యున్నతికి సర్పంచ్‌ల కృషి భేష్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభ్యున్నతికి సర్పంచ్‌ల కృషి భేష్‌

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

గ్రామాల అభ్యున్నతికి సర్పంచ్‌ల కృషి భేష్‌ ● తర్లుపాడు మండల సర్పంచ్‌ల సన్మానంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

మార్కాపురం: మండలంలోని గ్రామాల అభ్యున్నతికి సర్పంచ్‌లు తమ శక్తివంచన లేకుండా మెరుగైన కృషి చేశారని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కొనియాడారు. సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సోమవారం మార్కాపురం పట్టణంలోని విహారీ గ్రాండ్‌ ఇన్‌లో తర్లుపాడు మండల సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ గడచిన ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని గ్రామాల అభివృద్ధికి పాటుపడిన సర్పంచ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్‌ సీపీ అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ గాయం శ్రీనివాసరెడ్డి, మండలపార్టీ కన్వీనరు మురారి వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement