బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

మార్కాపురం రూరల్‌: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని వేములకోట జగనన్న కాలనీ వద్ద ఎదురెదురుగా వస్తున్న బైక్‌లు ఢీకొని ఇద్దరు వాహనదారులకు గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి నికరంపల్లి, చింతగుంట్ల నుంచి మార్కాపురం వస్తున్న బైక్‌లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆనెకాళ్ల పిచ్చిరామిరెడ్డి తలకు, చేతులకు గాయాలు కాగా మద్దుపల్లి సాయి కల్యాణ్‌ ప్రసాద్‌కు మోకాలికి తీవ్ర గాయమైంది.

మేడం ఆంజనేయులకు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు తరలించారు. రూరల్‌ ఎస్సై వేమన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement