ఆదిలాబాద్‌టౌన్: బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను ఆదివారం రెండో రోజు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశా రు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న రామన్న అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉదయం పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. బయటకు వెళ్లకుండా రోజంతా ఇంటి వద్ద పహారా నిర్వహించారు. పార్టీ నాయకులు ఆయనకు మద్దతుగా అక్కడికి చేరుకొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డు పెట్టుకొని అడ్డదారులు తొక్కుతుందని విమర్శించారు. ఖానాపూర్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అడ్డదారిలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.


